Sidhu: అంబానీలకు, అదానీలకు మోదీ ఓ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు!: సిద్ధూ తీవ్ర వ్యాఖ్యలు

  • అంబానీ, అదానీలకు మోదీ ఓ బిజినెస్ మేనేజర్
  •  ప్రభుత్వరంగ సంస్థలను నాశనం చేశారు
  • ప్రభుత్వ సంస్థలను పణంగా పెట్టి ఉన్నవాళ్లకు దోచిపెట్టారు

కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రధాని నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఐదేళ్ల పాలనతో మోదీ ప్రైవేటు వ్యక్తులకు మేలు చేయడం ద్వారా జాతి ప్రయోజనాలను తుంగలో తొక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


వ్యవహరిస్తున్నారని, అలాంటివాళ్ల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను పణంగా పెడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా 'మోదీ ఓ నికమ్మా' (పనికిమాలినవాడు) అంటూ హిందీ పద ప్రయోగం చేశారు. జాతీయతా భావం పేరుతో ఓట్ల రాగం ఆలపించడం మానేసి జాతి ప్రయోజనాల గురించి మాట్లాడాలని మోదీకి హితవు పలికారు.

Sidhu
Narendra Modi
Congress
BJP
  • Loading...

More Telugu News