Ranga Reddy District: బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని నవ వధువు బలవన్మరణం

  • రామకృష్ణారెడ్డితో కృతికారెడ్డి వివాహం
  • డిప్రెషన్‌తో బాధపడుతున్న కృతిక
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

నవ వధువు ఆత్మహత్య రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లో కలకలం రేపుతోంది. చేవెళ్లకు చెందిన కృతికారెడ్డికి వికారాబాద్‌కు చెందిన రామకృష్ణారెడ్డితో రెండు నెలల క్రితం వివాహమైంది. రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం నిర్వహిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ జంట గంధంగూడ ఇందుస్ విల్లాస్‌లో నివాసముంటోంది. గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధ పడుతున్న కృతికారెడ్డి నేటి ఉదయం బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నారు.

Ranga Reddy District
Krithika Reddy
Ramakrishna Reddy
Vikarabad
Software Ingeneer
Suicide
  • Loading...

More Telugu News