Shankar Goud: కార్యకర్తల కోరిక మేరకు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న జనసేన

  • జనసేన కార్యకర్తలతో సమావేశం
  • కార్యకర్తల అభిప్రాయాల సేకరణ
  • పార్టీకి మహిళ, యువతలే బలం

తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 5857 ఎంపీటీసీ, 535 జడ్పీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన కూడా తెలంగాణలో పోటీ చేయాలని అభిమానులు, కార్యకర్తలు పవన్ ను కోరడంతో ఈ ఎన్నికల్లో పోటీకి ఆ పార్టీ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన విషయాలన్నింటినీ తెలియజేస్తూ జనసేన ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

జనసేన కార్యకర్తలతో హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఇంచార్జ్ ఎన్.శంకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం శంకర్‌గౌడ్, మహేందర్ మీడియాతో మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కార్యకర్తల అభిప్రాయాలను తీసుకోవాలని పవన్ తమను ఆదేశించినట్టు తెలిపారు. తమ పార్టీకి యువత, మహిళలే బలమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి భిన్నంగా స్థానిక సంస్థల ఎన్నికల పోటీ ఉంటుందని స్పష్టం చేశారు.

Shankar Goud
Mahender Reddy
Hari Prasad
Janasena
Pawan Kalyan
Telangana
  • Loading...

More Telugu News