telangana: తెలంగాణ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. వివరాలు!

  • మూడు విడతల్లో ఎన్నికలు
  • మే 6, 10, 14 తేదీల్లో పోలింగ్
  • మే 27న ఫలితాల వెల్లడి

తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. స్థానిక సంస్థకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ ను విడుదల చేశారు. మొత్తం మూడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మే 6, 10, 14 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మే 27న ఫలితాలు విడుదలవుతాయి. ఈసారి ఎన్నికల దరఖాస్తులను ఆన్ లైన్లో స్వీకరించనున్నారు. తెలంగాణలో మొత్తం 538 జెడ్పీటీసీ... 5,817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి.

telangana
mptc
zptc
elections
  • Loading...

More Telugu News