babar: వాళ్లు బాబర్ సంతానమంటూ మరోసారి మత విద్వేష వ్యాఖ్యలు చేసిన యోగి

  • ఎస్పీ అభ్యర్థి రహ్మాన్ పై తీవ్ర వ్యాఖ్యలు
  • మొఘల్ రాజు సంతానమంటూ విమర్శ
  • దేశ అధికారాన్న దేశ ద్రోహులు, ఉగ్రవాదులకు అప్పగించవద్దంటూ విన్నపం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి విద్వేష వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి రహ్మాన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆయన మొఘల్ రాజు బాబర్ సంతానమని వ్యాఖ్యానించారు. వాళ్లు బాబర్ సంతానమని... అలాంటి వారికి ఓటు వేసి దేశ అధికారాన్ని ఉగ్రవాదులు, దేశద్రోహులకు అప్పగిస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి వారికి వ్యతిరేకంగా ఓటు వేసి భజరంగ్ బలికి మద్దతిస్తారా? అని అన్నారు. కొన్ని రోజుల క్రితమే అలీ, భజరంగ్ బలీ అంటూ యోగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై మూడు రోజుల ఎన్నికల ప్రచార నిషేధాన్ని ఈసీ విధించింది. ఇంతలోనే ఆయన మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు.

babar
yogi
adtyanath
rahman
bjp
sp
  • Loading...

More Telugu News