Chandrababu: రామోజీ ఇంట వేడుకలో.. చంద్రబాబును కలిసిన పవన్... నవ్వుతూ ముచ్చట్లు!

  • నేడు రామోజీరావు మనవరాలి పెళ్లి
  • హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • ఆశీర్వదించేందుకు వచ్చిన నేతలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ముఖాముఖి ఎదురుపడ్డారు. చిరునవ్వుతో పలకరించుకున్నారు. ఈ ఉదయం రామోజీరావు మనవరాలు కీర్తి సోహాన వివాహం జరుగగా, నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చిన వీరు ఒకరికి ఒకరు తారసపడ్డారు. వధూవరులను ఆశీర్వదించి, తిరుమల శ్రీవారి ప్రసాదాలను బహుమతిగా అందించిన చంద్రబాబు, వేదిక దిగిరాగానే పవన్ కల్యాణ్ ఎదురు పడ్డారు. నమస్కార, ప్రతినమస్కారాలు చేసుకుంటూ మాట్లాడుకున్నారు.

కాగా, గత సంవత్సరంలో అమరావతి ప్రాంతంలో జరిగిన ఓ ఆలయ విగ్రహ ప్రతిష్ఠలో కలుసుకున్న వీరిద్దరూ తిరిగి ఎదురెదురుగా తారసపడటం ఇదే తొలిసారి.

Chandrababu
Pawan Kalyan
Ramojirao
Marriage
  • Error fetching data: Network response was not ok

More Telugu News