Odisha: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం.. 9 మందిని సస్పెండ్ చేసిన కలెక్టర్!

  • ఒడిశాలోని బారగఢ్ జిల్లాలో ఘటన
  • పోలింగ్ అధికారులపై బీజేపీ నేతల ఫిర్యాదు
  • విచారణలో అధికారులు తప్పుచేసినట్లు తేలడంతో చర్యలు

సార్వత్రిక ఎన్నికల వేళ విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. ఏకంగా 9 మంది సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటన ఒడిశాలోని బారగఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ జిల్లాలో ఇటీవల రెండోదశ పోలింగ్ జరిగింది. అయితే విధి నిర్వహణలో అధికారులు అలసత్వంగా వ్యవహరించిట్లు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అందులో ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులు, ఆరుగురు సెక్టార్ అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలింది. దీంతో వీరిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇలా సస్పెండ్ అయినవారిలో ఉమాశంకర్ పాణిగ్రాహి, రోషన్ సేథి, ప్రియబ్రత సాహు, ప్రశాంత్ సేథి, ఉమాశంకర్, ప్రదీప్ ప్రధాన్ లు ఉన్నారు.

Odisha
baragadh
collector
negligence
9 ofiicials
suspended
  • Loading...

More Telugu News