Chandrababu: చంద్రబాబుగారు, సమాజసేవలో మీరు మరెన్నో సంవత్సరాలు గడపాలి: కేటీఆర్

  • నేడు 70వ వసంతంలో అడుగుపెట్టిన చంద్రబాబు
  • ప్రముఖుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
  • ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితం గడపాలని ఆకాంక్షించిన కేటీఆర్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం నేడు. ఈరోజుతో ఆయన 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్ సహా పలువురు కీలక నేతలు బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

'చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నా. సమాజ సేవలో మీరు మరెన్నో సంవత్సరాలు గడపాలని ఆకాంక్షిస్తున్నా' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Chandrababu
birthday
wishes
KTR
TRS
Telugudesam
  • Loading...

More Telugu News