earthquake: ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో కంపించిన భూమి...రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదు
- ఉదయం 6.30 గంటల సమయంలో ప్రకంపనలు
- భయాందోళనలకు గురైన జనం
- ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం లేదు
మన పొరుగున ఉన్న ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.4గా నమోదైందని భువనేశ్వర్‌లోని హెచ్.ఆర్.బిస్వాస్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం నిర్థారించింది. ఉదయం 6.20 గంటల సమయంలో ఒక్కసారిగా కదలిక రావడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థమయ్యేసరికి కొంత సమయం పట్టింది. ఒడిశా మయూర్‌బంజ్ జిల్లాలోని రాయిరంగ్‌పుర, బిసోయ్, గోరుమహిసాని, బహలాదా ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అలాగే, జార్ఖండ్‌లోని ఖరసావన్, సరైకేలా, ఘట్‌షీలా, దుమారియా, గురాబండ ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదు.