venkaiah naidu: టీవీలకు అతుక్కుపోయే సంస్కృతిని వదిలేయండి: వెంకయ్యనాయుడు
- బసవతారకం కేన్సర్ ఇనిస్టిట్యూట్-కేర్ హాస్పిటల్స్ కార్యక్రమానికి హాజరైన వెంకయ్య
- మన జీవనశైలికి శారీరక శ్రమ అవసరమన్న ఉపరాష్ట్రపతి
- మెరుగైన వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలంటూ ఆకాంక్ష
టీవీలు, సెల్ ఫోన్లు అందరి జీవితాల్లో అంతర్భాగాలైపోయాయి. గంటల తరబడి వీటితోనే జనాలు కాలక్షేపం చేస్తున్నారు. వీటి వల్ల మానవ సంబంధాలు బలహీనమవడమే కాక, అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి దూరంగా ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. టీవీలు, ఫోన్లకు అంటుకుపోయే సంస్కృతికి దూరంగా ఉండాలని అన్నారు. మన జీవనశైలికి శారీరక శ్రమ అత్యంత అవసరమని చెప్పారు.
స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బసవతారకం కేన్సర్ ఇనిస్టిట్యూట్- కేర్ హాస్పిటల్స్ సంయుక్తంగా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతలో ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య మాట్లాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఉత్సాహాన్నిస్తుందని చెప్పారు. మెరుగైన వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.