Road Accident: ప్రేమ ఫలించాలని గుడికి బయలుదేరితే... మృతి చెందిన ప్రియురాలిని చూసి బోరున విలపించిన ప్రియుడు!

  • ప్రేమగా మారిన ఫేస్ బుక్ పరిచయం
  • యాదగిరిగుట్టకు బయలుదేరిన ప్రేమజంట
  • బీబీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం
  • హెల్మెట్ ఉండటంతో బతికిపోయిన ప్రియుడు

వారిద్దరి మధ్యా ఫేస్ బుక్ లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దలకు విషయం చెప్పే ముందు దేవుడికి మొక్కుకోవాలని యాదగిరి నరసింహుని ఆశీర్వాదం తీసుకోవాలని బైక్ పై బయలుదేరారు. వారి ప్రేమను రోడ్డు ప్రమాదం చిదిమేసింది. ఈ ఘటన బీబీనగర్ సమీపంలో జరుగగా, తన కళ్ల ముందే కనుమూసిన ప్రియురాలిని చేతుల్లోకి తీసుకుని ప్రియుడు బోరున విలపిస్తుంటే, చూసిన వారంతా అయ్యో పాపం అనుకున్నారు.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, మంచిర్యాల ప్రాంతానికి చెందిన అరుణ (19) హైదరాబాద్ లోని వనితా మహా విద్యాలయంలో బీఎస్సీ చదువుతోంది. సిద్ధిపేట జిల్లాకు చెందిన దాడి శ్రీకాంత్ రామ్ నగర్ లో క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నాడు. వీరిద్దరికీ ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలని భావించారు. తమ పెద్దలు ప్రేమను అంగీకరించేలా మొక్కుకోవాలని కోరుకునేందుకు బైక్ పై యాదగిరిగుట్టకు బయలుదేరారు. బీబీనగర్ పెద్ద చెరువు కట్ట సమీపంలో వీరి వాహనం అదుపుతప్పి కిందపడగా, వెనుకనుంచి వస్తున్న ఓ కారు అమాంతం అరుణపైకి ఎక్కేసింది. తలకు హెల్మెట్ ఉండటంతో శ్రీకాంత్ గాయాలతో తప్పించుకోగా, పై నుంచి కారు వెళ్లడంతో అరుణ అక్కడికక్కడే మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

Road Accident
Lovers
Yadadri Bhuvanagiri District
Bibinagar
  • Loading...

More Telugu News