Mad Dog: ఎవరు కనిపిస్తే వారిని పీకింది... 66 మందిని కరిచిన కుక్క!

  • తమిళనాడులోని సేలంలో ఘటన
  • పిచ్చి పట్టి ఇష్టానుసారం దాడులు
  • కొట్టి చంపిన స్థానికులు

ఓ కుక్క ఏకంగా 66 మందిని కరిచింది. రోడ్డుపై తనకు కనిపించిన వారందరి పిక్కలూ పట్టేసింది. స్థానికులు అందరూ కలిసి తరిమికొట్టేలోపు పలువురు గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని సేలం కచ్చిపాళయం వద్ద జరిగింది. పచ్చపట్టి, నారాయణనగర్, కురింజి నగర్ ప్రాంతాల్లో ఓ కుక్క ఇష్టమొచ్చినట్టు తిరుగుతూ హంగామా చేసింది.

కుక్క దాడిలో గాయపడిన వారిలో అత్యధికులు సేలం ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కట్టారు. కొందరు ప్రైవేటు ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం వెళ్లారు. దాడి చేసిన కుక్కకు పిచ్చి పట్టిన కారణంగా వీరందరికీ రేబిస్ టీకాలు వేశామని వైద్యలు తెలిపారు. ఆపై కుక్కను వేటాడిన స్థానికులు పట్ట కోయిల్ ప్రాంతంలో దాన్ని గుర్తించి, కొట్టి చంపారు.

Mad Dog
Bite
Tamilnadu
Salem
  • Loading...

More Telugu News