South Africa: బ్రెయిన్ ట్యూమర్‌తో మృతి చెందిన స్కాట్లాండ్ ఆల్‌రౌండర్.. విషాదంలో క్రికెట్ ప్రపంచం

  • ఏడాది కాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న కాన్
  • పుట్టింది సౌతాఫ్రికాలోనైనా స్కాట్లాండ్‌కు ప్రాతినిధ్యం
  • 2015లో తొలి అంతర్జాతీయ మ్యాచ్

స్కాట్లాండ్ క్రికెట్‌లో విషాదం నెలకొంది. 38 ఏళ్ల ఆ జట్టు ఆటగాడు కాన్ డి వెట్ లాంజ్ బ్రెయిన్ ట్యూమర్‌తో గురువారం మృతి చెందాడు. ఏడాది కాలంగా ట్యూమర్‌తో బాధపడుతున్న కాన్ దక్షిణాఫ్రికా, కాప్ ప్రావిన్స్‌లో బెల్‌విల్లేలో ఫిబ్రవరి 11, 1981లో జన్మించాడు. స్కాంట్లాండ్ తరపున 21 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. నవంబరు 2017న చివరి మ్యాచ్ ఆడాడు.

1998లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ కాన్ కు తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్. జాతీయ జట్టుకు తొలిసారిగా 2015-17 మధ్య జరిగిన ఐసీసీ ఇంటర్నేషనల్ కప్‌లో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. జూన్ 2015న ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ అతడికి తొలి అంతర్జాతీయ మ్యాచ్. ఐర్లండ్‌పై తొలి టీ20 ఆడాడు. అంతేకాదు, స్కాట్లాండ్ జట్టుకు వైస్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.

కాన్ మృతికి క్రికెట్ ప్రపంచం సంతాపం తెలిపింది. అలెన్ డొనాల్డ్ నుంచి డేవిడ్ విల్లీ వరకు అందరూ తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News