Devineni uma: జగన్‌కు చివరికి మిగిలేది నేమ్‌ప్లేటే: దేవినేని ఉమ సెటైర్

  • ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన జగన్ నేమ్‌ప్లేట్
  • రూ. 300 కోట్లు తీసుకుని జగన్‌కు పీకే ఇచ్చింది ఇదేనన్న దేవినేని
  • టీడీపీ విజయం ఏకపక్షమన్న మంత్రి

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి చివరికి మిగిలేది నేమ్ ప్లేటేనని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ రూ.300 కోట్లు తీసుకుని జగన్ చేతిలో ముఖ్యమంత్రి మీరేనంటూ నేమ్ ప్లేట్ పెట్టి వెళ్లిపోయారని సెటైర్ వేశారు. అవినీతి సొమ్ముతో పందాలకు దిగుతున్న వైసీపీ నేతలకు పరాభవం తప్పదని, ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమని అన్నారు. ఎన్నికలు పూర్తి ఏకపక్షంగా జరిగాయని, టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరని ఉమ తేల్చి చెప్పారు.

జగన్ చేయించుకున్నట్టుగా చెబుతున్న ఓ నేమ్ ప్లేట్ ఇటీవల  సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ‘వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి’ అన్న నేమ్ ప్లేట్ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ప్రజా తీర్పు వెల్లడి కావడానికి ముందే జగన్ తానే సీఎంనంటూ నేమ్‌ప్లేట్లు కూడా చేయించుకుంటున్నారంటూ టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. తాజాగా దేవినేని ఉమ సెటైర్లు వేశారు.

Devineni uma
Jagan
Name plate
Andhra Pradesh
Chief Minister
YSRCP
  • Loading...

More Telugu News