Chandrababu: నేడు చంద్రబాబు జన్మదినం.. రోజంతా బిజీ బిజీ!

  • నేటితో 69 ఏళ్లు పూర్తి
  • ఉదయం 9 నుంచి 10:30 వరకు అందరికీ అందుబాటులో
  • హైదరాబాద్‌లో ఓ పెళ్లికి హాజరుకానున్న బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు 70వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. జన్మదినం సందర్భంగా నేడు రోజంతా ఆయన బిజీగా గడపనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10: 30 గంటల వరకు ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలు, అభిమానులతో గడుపుతారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగే ఓ వివాహానికి హాజరవుతారు. అక్కడి నుంచి నేరుగా తిరుపతి చేరుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో నిర్మించిన బ్లడ్‌బ్యాంకును ప్రారంభిస్తారు. రాత్రికి తిరిగి అమరావతి చేరుకుంటారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఇప్పటికే పలువురు నేతలు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Chandrababu
Birth day
Andhra Pradesh
Telugudesam
vundavalli
  • Loading...

More Telugu News