Supreme Court: మానసిక రుగ్మతలకి లోనైన వారికి మరణ శిక్ష అమలు చేయవద్దు: సుప్రీంకోర్టు
- గతంలో జరిగిన అత్యాచారం .. హత్యకేసు
- నిందితుడికి ఉరిశిక్ష
- ప్రస్తుతం మానసిక స్థితి కోల్పోయిన దోషి
కోర్టు మరణశిక్ష విధించిన తరువాత .. ఆ శిక్షను అమలు జరిపేలోగా సదరు దోషి మానసిక రుగ్మతలకి లోనైతే, ఆ శిక్షను అమలు పరచవలసిన అవసరం లేదని తాజాగా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. 1999లో మహారాష్ట్రలో ఇద్దరు మైనర్ బాలికలపై ఒక వ్యక్తి అత్యాచారం చేసి, హతమార్చాడు. ఆ కేసు విచారణ అనంతరం ఆ వ్యక్తికి ఉరి శిక్షను ఖాయం చేశారు. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తికి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో, ఈ కేసును ఎలా చూడాలనే ప్రశ్నలు ధర్మాసనం ముందుకు వచ్చాయి. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో జస్టిస్ శంతన గౌండర్ .. జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.