Maganti Rupa: దేవుడి దయ, మీ అభిమానం... నాకేమీ కాలేదు: మాగంటి రూప

  • వోల్వో కారుకు మరో కారు ఎదురొచ్చింది
  • చిన్న ప్రమాదమే
  • భయపడాల్సిందేమీలేదు

సినీ నటుడు, టీడీపీ నేత మురళీమోహన్ కోడలు మాగంటి రూప ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. జరిగిన ఘటనను ఆమె స్వయంగా వివరించారు. ఈ మేరకు ఓ వీడియో ద్వారా మాట్లాడారు.

"నేడు ఉదయం ఐదు గంటల సమయంలో రాజమండ్రి వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయల్దేరాను. నా వోల్వో కారుకు మరో కారు ఎదురుగా వచ్చి ఢీకొంది. దేవుడి దయ వల్ల, మీ అందరి అభిమానం వల్ల నాకేమీ కాలేదు. జరిగింది చిన్న ప్రమాదమే. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. భయపడాల్సిన పనిలేదు" అంటూ  అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మాగంటి రూప రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన సంగతి తెలిసిందే. 

Maganti Rupa
Telugudesam
  • Error fetching data: Network response was not ok

More Telugu News