trisha: త్రిష తాజా చిత్రం షూటింగు మొదలు .. టైటిల్ ఖరారు

- లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై త్రిష
- టైటిల్ గా 'రాంగి' ఖరారు
- దర్శకుడిగా మురుగదాస్ శిష్యుడు
మురుగదాస్ ఒక వైపున రజనీ 'దర్బార్' సినిమాకి దర్శకుడిగా తన పనులను చక్కబెడుతూనే, మరో వైపున తన శిష్యుడు రూపొందిస్తోన్న సినిమాకి కథను అందించాడు. మురుగదాస్ మంచి రచయిత కూడా. తన సినిమాలకి కథ .. కథనాలను ఆయనే రాసుకుంటాడు. అలా ఆయన భారీ విజయాలనే సొంతం చేసుకున్నాడు. అలాంటి మురుగదాస్ .. తన శిష్యుడు శరవణన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న సినిమాకి కథను అందించాడు.
