Telangana: భార్యను పుట్టింటికి తరిమేసి మరో యువతితో అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చావగొట్టిన భార్య!

  • తెలంగాణలోని భద్రాద్రి జిల్లాలో ఘటన
  • పిల్లలు పుట్టలేదని భార్యకు వేధింపులు
  • ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి కొట్టిన యువతి బంధువులు

పిల్లలు పుట్టలేదని ఓ ప్రబుద్ధుడు తన భార్యను వేధింపులకు గురిచేశాడు. వీటిని తాళలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోగానే, మరదలు వరసయ్యే ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు భార్య అతడిని చితక్కొట్టింది. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరంలో సాంబశివరావు, అదే ప్రాంతానికి చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ దంపతులకు పిల్లలు పుట్టకపోవడంతో భార్యను వేధించుకుని తినడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులు హద్దు దాటడంతో బాధితురాలు పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సాంబశివరావు తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న భార్య పోలీసులను ఆశ్రయించింది. బంధువుల సాయంతో భర్తను ఇంటి నుంచి బయటకు లాక్కునివచ్చింది. అనంతరం కుటుంబ సభ్యుల సాయంతో చితక్కొట్టింది. మరోవైపు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Telangana
Bhadradri Kothagudem District
sexual harrsment
Police
attack
  • Error fetching data: Network response was not ok

More Telugu News