polavaram: పోలవరంపై ఇప్పుడు సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏముంది?: బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

  • ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు సమీక్షలు చేయరాదనే విషయం చంద్రబాబుకు తెలియదా?
  • పోలీస్ వ్యవస్థను నాశనం చేసి ఇప్పుడు సమీక్షిస్తున్నారు
  • 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఎవరూ చూడవద్దా?

బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని చేయడం లేదని వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించకూడదనే విషయం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. గత మూడు నెలలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోమ్ గార్డులకు జీతాలు లేవని... దీనిపై రివ్యూ ఎందుకు చేయలేదని అన్నారు. పోలీస్ వ్యవస్థను ఐదేళ్లుగా నాశనం చేసి ఇప్పుడు సమీక్షిస్తున్నారని మండిపడ్డారు. పోలవరంపై ఇప్పుడు సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. 'కథానాయకుడు', 'మహానాయకుడు' చిత్రాలను మాత్రం అందరూ చూడాలి... 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఎవరూ చూడవద్దా? అంటూ దుయ్యబట్టారు.

polavaram
Chandrababu
buggana
Telugudesam
ysrcp
  • Loading...

More Telugu News