kota shankar rao: పాత సినిమాల్లో కథ ఉండేది .. ఇప్పుడది లేదు: కోట శంకర్రావు
- పాత సినిమాల్లో కథకి ప్రాధాన్యత
- ఈ తరం ఆలోచనా విధానం మారింది
- మంచిదైనప్పుడు మార్పును అంగీకరించాల్సిందే
కోట శ్రీనివాసరావు సోదరుడు కోట శంకర్రావు కూడా మంచి నటుడు. డైలాగ్స్ ను చాలా సహజంగా చెప్పడం ఆయన ప్రత్యేకత. రంగస్థలం నుంచి వచ్చిన ఆయన, సినిమాల్లోను .. సీరియల్స్ లోను నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "పాత సినిమాలు కదా అని వాటిని గురించి తేలికగా మాట్లాడకూడదు. అలాగే పాత సినిమాలంత గొప్పగా లేవని ఈ తరం సినిమాలను కొట్టిపారేయకూడదు.
మార్పు రావడం సహజం .. అయితే ఆ మార్పు మంచిదైవుండాలి. పాత సినిమాల్లోని మంచిని ఇప్పటి సినిమాల్లో వదిలేస్తున్నారేమోనని అనిపిస్తోంది. ప్రధానంగా చెప్పుకోవలసిన విషయమేంటంటే, పాత సినిమాల్లో కథ ఉండేది .. ఇప్పటి సినిమాల్లో అదే ఉండటం లేదు. పాత సినిమాల్లో మొదటి ప్రాధాన్యత కథకి ఉండేది .. ఆ తరువాతనే హీరో. ఇప్పడు ఆ పరిస్థితి లేదు . . ఆలోచనా విధానంలో పూర్తిగా తేడా వచ్చేసింది. కొత్తదనాన్ని అంగీకరించవలసిందే .. అయితే అది శ్రుతిమించకుండా చూసుకోవాలి .. అంతే" అని చెప్పుకొచ్చారు.