Andhra Pradesh: అపోలోలో చేరిన కుప్పం వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి.. పరామర్శించిన వైఎస్ జగన్!

  • హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స
  • ఆసుపత్రికి వెళ్లిన జగన్, కుటుంబ సభ్యులకు ఓదార్పు
  • చంద్రబాబుపై పోటీ చేసిన చంద్రమౌళి 

వైసీపీ కుప్పం అభ్యర్థి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. కాగా, ప్రస్తుతం రాజమౌళి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ఈరోజు అపోలోకు చేరుకుని రాజమౌళిని పరామర్శించారు.

రాజమౌళి ఆరోగ్యంపై వైద్యులు, ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలనీ, రాజమౌళి త్వరగా కోలుకుంటారని ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనపై రాజమౌళి పోటీకి దిగారు. 

Andhra Pradesh
Telangana
Hyderabad
appollo
Jagan
YSRCP
  • Loading...

More Telugu News