maa: 'మా' అసోసియేషన్ లో గొడవలు.. ఉపాధ్యక్ష పదవికి ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా

  • 'మా'లో ముదురుతున్న గొడవలు
  • సభ్యుల మధ్య కొరవడిన సఖ్యత
  • నిధుల దుర్వినియోగమే కారణమని టాక్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో గొడవలు తీవ్రతరమవుతున్నాయి. అసోసియేషన్ ఎన్నికలు జరిగి... సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన రోజుల వ్యవధిలోనే గొడవలు మరింత ముదిరాయి. అసోసియేషన్ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో, అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవికి సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా చేశారు. రాజీనామాకు గల కారణాన్ని ఆయన వెల్లడించకపోయినా... అసోసియేషన్ లో నిధుల దుర్వినియోగమే రాజీనామాకు కారణమని ఫిలింనగర్ టాక్. మరోవైపు, అసోసియేషన్ లో వివాదాలు సినీవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

maa
vice president
sv krishna reddy
resign
tollywood
  • Loading...

More Telugu News