Rahul Gandhi: తనను కలవలేకపోయిన చిన్నారి అభిమానికి రాహుల్ గాంధీ ఫోన్!

  • వయనాడ్ లో పర్యటించిన రాహుల్
  • రాహుల్ ను కలిసేందుకు వచ్చిన చిన్నారి నందన్
  • కలవలేక వెళ్లిపోవడంతో స్వయంగా ఫోన్ చేసిన రాహుల్

తనను కలవడానికి విశ్వప్రయత్నం చేసి విఫలమైన ఓ చిన్నారికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేశారు. ఆ బిడ్డ తండ్రి ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది తెగ వైరల్ అయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లో  ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వేళ, రాహుల్ ను కలిసేందుకు నందన్ అనే బాలుడు వచ్చాడు. ఉదయం 5 గంటల నుంచి ఎదురుచూసిన నందన్, భద్రతా కారణాలతో రాహుల్ ను కలవలేక నిరాశతో వెనక్కు వెళ్లాడు.

ఈ విషయాన్ని ఫేస్ బుక్ లో నందన్ తండ్రి పోస్ట్ చేయగా, అది రాహుల్ కు చేరింది. రాహుల్ పై తన కుమారుడికి ఎంతో అభిమానమని, 'మోస్ట్‌ ఫేవరెట్‌ పర్సన్‌' అన్న ప్లకార్డుతో పాటు జేబుకు రాహుల్ ఫోటో పెట్టుకుని తన కుమారుడు వచ్చాడని తెలిపాడు. ఎంతోసేపు నిరీక్షించినా రాహుల్ ను కలవలేకపోగా, నిరాశకు గురయ్యాడని చెప్పారు. ఈ పోస్ట్ ను చూసిన రాహుల్ నందన్ తండ్రికి స్వయంగా కాల్ చేశారు. "హాయ్‌.. నేను రాహుల్‌ గాంధీని మాట్లాడుతున్నాను. నేను నా అభిమానితో మాట్లాడవచ్చా" అని అడిగారు. ఆ తర్వాత నందన్ తో కాసేపు మాట్లాడారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మహిళా నేత రమ్య సైతం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.



Rahul Gandhi
Vayanad
Nandan
Facebook
Social Media
  • Loading...

More Telugu News