Chandrababu: నేడు రాహుల్ తో కలసి ప్రచారం నిర్వహించనున్న చంద్రబాబు

  • రాయచూర్ లో ఎన్నికల ప్రచారం
  • ఒకే సభలో పాల్గొననున్న రాహుల్, చంద్రబాబు
  • కాంగ్రెస్, జేడీఎస్ కు మద్దతుగా ప్రచారం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కర్ణాటకలో పర్యటించనున్నారు. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలసి ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మధ్యాహ్నం రాయచూర్ లో నిర్వహించే సభలో రాహుల్, చంద్రబాబులు కలసి పాల్గొంటారు. కర్ణాటకలో ఇప్పటికే చంద్రబాబు ప్రచారం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కు మద్దతుగా మాండ్య నియోజకవర్గంలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. నిఖిల్ పై దివంగత అంబరీష్ భార్య, సినీ నటి సుమలత పోటీ  చేస్తున్నారు.

Chandrababu
Telugudesam
Rahul Gandhi
jds
  • Loading...

More Telugu News