murali mohan: రోడ్డు ప్రమాదం.. మురళీమోహన్ కోడలు రూపకు స్వల్ప గాయాలు

  • శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో రోడ్డు ప్రమాదం
  • అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన రూప
  • నిలకడగా ఉన్న ఆరోగ్య పరిస్థితి

రాజమండ్రి టీడీపీ ఎంపీ, సినీనటుడు మురళీ మోహన్ కోడలు మాగంటి రూప రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొంది.

ఈ ఘటనలో స్వల్పంగా గాయపడ్డ రూపను అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్సను అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. కాసేపటి క్రితం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు ఆమెకు సూచించారు.

మరోవైపు, ఈ ఎన్నికల్లో రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా రూప పోటీ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల మురళీమోహన్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

murali mohan
maganti rupa
accident
Telugudesam
  • Loading...

More Telugu News