Uttar Pradesh: అభిమానానికి పరాకాష్ఠ .. బీఎస్పీకి బదులు బీజేపీకి ఓటేశానని వేలు నరుక్కున్న యువకుడు!

  • ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ నియోజకవర్గంలో ఘటన
  • మరోసారి పొరపాటు జరగకూడదని వేలు నరుక్కున్న యువకుడు
  • సోషల్ మీడియాలో వీడియో పోస్ట్

పార్టీపై ఓ అభిమాని పెంచుకున్న అభిమానానికి ఇది పరాకాష్ఠ. తాను అభిమానించే పార్టీకి కాకుండా పొరపాటున మరో పార్టీకి ఓటేసినందుకు శిక్షగా తన వేలినే నరుక్కున్నాడో యువకుడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ నియోజకవర్గంలోని షికార్‌పూర్ పోలింగ్ కేంద్రంలో జరిగిందీ ఘటన. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం ఈ  నియోజకవర్గంలో రెండో విడత పోలింగ్ జరిగింది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ భోలాసింగ్-ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ ఉమ్మడి అభ్యర్థి యోగేశ్ వర్మ బరిలో ఉన్నారు.

బీఎస్పీ మద్దతుదారుడైన పవన్ కుమార్ (25) ఓటు హక్కు వినియోగించుకునేందుకు గురువారం ఉదయం షికార్‌పూర్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాడు. అయితే, బీఎస్పీకి ఓటేయబోయి  పొరపాటున బీజేపీకి ఓటు వేశాడు. పొరపాటు జరిగిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన పవన్ మరోసారి ఇలాంటి తప్పు జరగకూడదనే ఉద్దేశంతో ఓటు వేసిన వేలిని కత్తితో తెగ్గోసుకున్నాడు. వేలు నరుక్కుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

Uttar Pradesh
Bulandshahar
BSP
BJP
finger
cutting
  • Loading...

More Telugu News