Varun Tej: గడ్డం, చెవిపోగుతో ఆకట్టుకుంటున్న వరుణ్ తేజ్

  • ‘వాల్మీకి’ ఫస్ట్‌లుక్ విడుదల
  • స్వరాలు సమకూరుస్తున్న దేవిశ్రీ ప్రసాద్
  • వినూత్న లుక్‌లో కనిపిస్తున్న వరుణ్‌తేజ్

వరుస విజయాలతో దూసుకుపోతున్న వరుణ్‌తేజ్ ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి అనే చిత్రంలో నటిస్తున్నాడు. రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నేటి నుంచి జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. గతంలో చేసిన ఏ సినిమాలోనూ కనిపించనటువంటి వినూత్న లుక్‌లో వరుణ్ కనిపిస్తున్నాడు.

గడ్డం, చెవిపోగుతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా ‘వాల్మీకి స్వాగతం.. తొలి రోజు షూటింగ్‌ అద్భుతంగా జరిగింది. ఇది ఇలాగే సాగాలని ఎదురుచూస్తున్నా. మండు వేసవిలో కష్టపడుతున్న సినిమాటోగ్రాఫర్‌ అయాంక్‌ బోస్‌కు ధన్యవాదాలు’ అంటూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు.

Varun Tej
Valmiki
Harish Shankar
Devisri Prasad
Ayank Bose
  • Loading...

More Telugu News