West Bengal: మమ్మల్ని ఓటేయనీయకుండా అడ్డుకుంటున్నారు: బెంగాల్ లోని హిందూ ఓటర్ల ఆందోళన

  • బీజేపీకి ఓటు వేస్తామని అడ్డుకుంటున్నారు
  • బోగస్ పేర్లతో ఇప్పటికే ఓటు వేశారు
  • ఓటర్ స్లిప్పులను చూపిస్తూ ఆందోళన

పశ్చిమ బెంగాల్‌లో తమను ఓటేయనీయకుండా అడ్డుకుంటున్నారని హిందూ ఓటర్లు ఆందోళనకు దిగారు. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లకు వెళ్లిన తమను అడ్డుకున్న కొందరు ముస్లింలు తమ ఓటరు గుర్తింపు కార్డులను లాక్కున్నారని హిందువులు ఆరోపిస్తున్నారు. ముస్లిం మెజారిటి గ్రామమైన పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో 600 మంది వరకూ హిందువులు నివసిస్తున్నారు.

అయితే తాము బీజేపీకి ఓటు వేస్తామనే తలంపుతో తమను అడ్డుకుంటారని హిందూ ఓటర్లు ఆరోపిస్తున్నారు. తమ ఓట్లను బోగస్ పేరుతో అప్పటికే వేసినట్టు మరికొందరు హిందూ ఓటర్లు వెల్లడించారు. తమకు జారీ చేసిన ఓటర్ స్లిప్పులను చూపిస్తూ వారు ఆందోళనకు దిగారు.

West Bengal
Polling Booth
Rai Ganj
Hindu voters
  • Loading...

More Telugu News