Andhra Pradesh: ఏపీలో భారీగా పోలింగ్ నమోదయింది.. ఇది టీడీపీ విజయానికి కారణం కాబోతోంది!: మంత్రి అమర్నాథ్ రెడ్డి

  • గతంలో ఇంతలా పోలింగ్ జరగలేదు
  • కేసీఆర్ తరహాలో మోదీ సాయం కోసం జగన్ ప్రయత్నించారు
  • చిత్తూరులో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్నివర్గాల ప్రజలు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి వచ్చారని ఏపీ మంత్రి, టీడీపీ నేత ఎన్.అమర్నాథరెడ్డి తెలిపారు. గతంలో ఎన్నడూ  ఇంత భారీగా పోలింగ్ నమోదు కాలేదని వ్యాఖ్యానించారు. ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.

చిత్తూరు జిల్లాలో ఈరోజు మీడియాతో మంత్రి మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ తరహాలో ఏపీ ఎన్నికల్లో మోదీ సాయం పొందేందుకు జగన్ ప్రయత్నించారని ఆరోపించారు. ఏపీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం టీడీపీ గెలుపునకు కారణం కాబోతోందని అభిప్రాయపడ్డారు.

Andhra Pradesh
Chittoor District
Telugudesam
N AMARNATH REDDY
  • Loading...

More Telugu News