RGV: కేసీఆర్ పై రామ్ గోపాల్ వర్మ బయోపిక్.. టైటిల్ ప్రకటించిన దర్శకుడు!

  • గతంలో సినిమా తీస్తానని ప్రకటించిన వర్మ
  • చెప్పినట్లుగానే  ‘టైగర్ కేసీఆర్.. ది అగ్రెసివ్ గాంధీ’ పేరు ఖరారు
  • త్వరలోనే మరిన్ని విషయాలు ప్రకటించే ఛాన్స్

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త ప్రాజెక్టును చేపట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సినిమా తీస్తానని చాలా రోజుల క్రితం ప్రకటించిన వర్మ అన్నట్లుగానే బయోపిక్ టైటిల్ ను ఈరోజు ప్రకటించారు. ‘టైగర్ కేసీఆర్.. ది అగ్రెసివ్ గాంధీ’ అని ఈ సినిమాకు టైటిల్ పెట్టినట్లు వర్మ ట్విట్టర్ లో తెలిపారు.

ఈ టైటిల్ కు ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అనే లైన్ ను జతచేశారు. కాగా, ఈ సినిమాలో నటీనటుల విషయమై త్వరలోనే వర్మ మరిన్ని విషయాలను వెల్లడించే అవకాశముందని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ జీవితం, తెలంగాణ ఉద్యమంపై ‘ఉద్యమ సింహం’ అనే సినిమా ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే.

RGV
KCR
Talking Movies
movies
Tollywood
Twitter
  • Loading...

More Telugu News