VH: కాంగ్రెస్ నేత వీహెచ్ అనూహ్య నిర్ణయం.. రేపు కాకినాడలో ధర్నా!

  • ఇంద్రపాలెం, అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా
  • తెలంగాణలో అంబేద్కర్ కు అవమానం జరిగింది
  • ఆ విషయం ఏపీ ప్రజలకు తెలిపేందుకే ధర్నా

తూర్పు గోదావరి జిల్లా ముఖ్యపట్టణం కాకినాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం నాడు ధర్నా చేయనున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు తెలంగాణలో తీవ్ర అవమానం జరిగిందని, దాని గురించి ఏపీ ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిరసన కార్యక్రమం చేయాలని నిర్ణయించామని అన్నారు.

 ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలుపుతామని అన్నారు. ఇదే సమయంలో ఈసీపైనా ఆరోపణలు చేసిన వీహెచ్, ఇష్టానుసారం అధికారులను బదిలీ చేస్తున్న ఈసీ ఓవరాక్షన్ చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ఎవరిపై దాడి చేయమంటే, వారిపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని అన్నారు. ఇండియాలోని స్వతంత్ర వ్యవస్థలను నరేంద్ర మోదీ భ్రష్టు పట్టించారని వీహెచ్ ఆరోపించారు.

VH
Kakinada
East Godavari District
Protest
Ambedkar
  • Loading...

More Telugu News