Nalgonda District: లారీ నిండా గంజాయి మూటలు...పంతంగి టోల్‌ గేట్‌ వద్ద భారీగా స్వాధీనం

  • లారీలో తరలిస్తున్న 1121 కేజీలు
  • పోలీసుల తనిఖీల్లో బయటపడిన వైనం
  • విలువ రూ.1.68 కోట్ల పైమాటే

లారీలో భారీగా తరలిపోతున్న గంజాయి మూటల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌గేట్‌ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో గంజాయి మూటలు పట్టుబడ్డాయి. మొత్తం 1121 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దీని విలువ కోటీ 68 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. విశాఖ జిల్లాలో ఒడిశా సరిహద్దున ఉన్న సీలేరు ఏజెన్సీ నుంచి మహారాష్ట్రకు దీన్ని తరలిస్తుండగా చెక్‌ పోస్టు వద్ద పోలీసులకు చిక్కింది. సరుకుతోపాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లారీని సీజ్‌ చేశారు.

Nalgonda District
panthangi tollgate
cannabis
1121 kgs
  • Loading...

More Telugu News