sai dharam tej: నేను వెనకబడటానికి ఇవే కారణాలు: హీరో సాయిధరమ్ తేజ్

  • కథల ఎంపిక విషయంలో పొరపాట్లు జరిగాయి 
  • సినిమా సరైన సమయంలో విడుదల కావాలి 
  • నా సినిమాలపై ఎవరి ఒత్తిడి వుండదు  

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో, చాలా త్వరగా మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నవాడిగా సాయిధరమ్ తేజ్ కనిపిస్తాడు. ఆరంభంలో వరుస విజయాలను అందుకున్న ఆయనకి, ఆ తరువాత అదేస్థాయిలో పరాజయాలు పలకరించడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనకి, 'వరుస పరాజయాలకు కారణం ఏమిటి?' అనే ప్రశ్న ఎదురైంది.

అందుకు ఆయన స్పందిస్తూ .. "సరైన కథలను ఎంచుకోకపోవడం మొదటికారణంగా భావిస్తాను. ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందనుకున్న కంటెంట్ ఒక్కోసారి వాళ్లకి రీచ్ కాదు. ఫలితంగా సినిమా సరిగ్గా ఆడకపోవడం జరుగుతుంటుంది. ఇక సరైన సమయంలో విడుదల అనేది కూడా సినిమా ఫలితంపై ప్రభావం చూపుతుంది. సరైన సమయంలో విడుదల కాకపోతే కూడా ఆ సినిమాలు దెబ్బతింటూ ఉంటాయి. సినిమా పరాజయంపాలు కావడానికి ఇది రెండవ కారణమని నా అభిప్రాయం. ఇక నా చుట్టూవున్న కొంతమంది ఒత్తిడి చేయడం వలన, నేను కథలను గురించి పట్టించుకోకుండా ఒప్పేసుకుంటాననే టాక్ వుంది. అందులో ఎంతమాత్రం నిజం లేదు" అని ఆయన చెప్పుకొచ్చాడు.

sai dharam tej
kalyani priyadarshan
  • Loading...

More Telugu News