Redbus: అల్లు అర్జున్ ను రీప్లేస్ చేసిన ఎంఎస్ ధోనీ!

  • రెడ్ బస్ ప్రచారకర్తగా ఇంతవరకూ అల్లు అర్జున్
  • ఇక నుంచి వ్యాపార ప్రకటనల్లో కనిపించనున్న ధోనీ
  • మీడియా ప్రకటనలో రెడ్ బస్ సీఈఓ

ఆన్ లైన్ మాధ్యమంగా బస్ టికెట్ బుకింగ్ సేవలందిస్తున్న రెడ్ బస్ కు ఇంతకాలమూ అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. బన్నీతో పాటు అలీ కలిసి చేసిన వ్యాపార ప్రకటనలు రెడ్ బస్ కస్టమర్ బేస్ ను పెంచేందుకు సహకరించాయి కూడా.

ఇక తాజాగా, అల్లు అర్జున్ స్థానంలో స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీని రెడ్ బస్ ఎంగేజ్ చేసుకుంది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ ప్రకాశ్ స్వయంగా ఓ ప్రకటనలో వెల్లడించారు. ధోనీ వంటి క్రికెటర్‌ రెడ్ బస్ కు ప్రచారకర్తగా ఉండడం గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు.

ఇకపై తమ అన్ని రెడ్‌ బస్‌ బ్రాండ్‌ లలో ధోనీ కనిపిస్తారని చెబుతూ, సింగ్ గెటప్‌ లో ధోనీ ఉన్న చిత్రాన్ని ఆయన విడుదల చేశారు. రెడ్‌ బస్‌ కు మరింత క్రేజ్ తెచ్చేలా కొత్త టీవీసీలు ఉంటాయని అన్నారు. చిన్న పట్టణాలకు సైతం విస్తరించే లక్ష్యంతో అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నామని, తమ ప్రయత్నంలో లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటామన్న నమ్మకం ఉందని అన్నారు.

Redbus
Allu Arjun
MS Dhoni
Brand Ambassedor
  • Loading...

More Telugu News