Karnataka: తాను చదువుకున్న పాఠశాలోనే ఓటేసిన ప్రకాశ్ రాజ్‌

  • బెంగళూరు సెంట్రల్‌ సెయింట్‌జోసఫ్‌ పాఠశాలలో ఓటు
  • ఇది చాలా ఆనందాన్నిచ్చిందని వ్యాఖ్యానించిన రాజ్‌
  • ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ

తాను చదువుకున్న పాఠశాలలోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రావడం కొత్త అనుభూతినిచ్చిందని, చాలా సంతోషంగా ఉందని సినీ నటుడు, బెంగళూరు సెంట్రల్‌ స్వతంత్ర అభ్యర్థి ప్రకాశ్ రాజ్‌ అన్నారు. ఈరోజు ఆయన సిటీ సెంట్రల్‌లోని సెయింట్‌ జోసఫ్‌ పాఠశాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ఓటు హక్కు ఉన్న వారంతా ఓటువేసి సద్వినియోగం చేయాలని కోరారు. ఓటర్లలో చైతన్యం పెరిగిందని, ఇందుకు కనిపిస్తున్న క్యూలే నిదర్శనమని, దీనివల్ల ఈసారి పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

Karnataka
benglur central
Prakash Raj
  • Loading...

More Telugu News