Andhra Pradesh: ఏపీలో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం.. బ్లేడుతో తీవ్రంగా గాయపర్చుకున్న యువకుడు!

  • కృష్ణా జిల్లాలోని విజయవాడలో ఘటన
  • 108లో ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్న వైద్యులు

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో సుధాకర్ అనే వ్యక్తి ఈరోజు వీరంగం సృష్టించాడు. కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన సుధాకర్ ఈరోజు విజయవాడలో బ్లేడుతో తనను తాను తీవ్రంగా గాయపర్చుకున్నాడు. దీంతో అటుగా వెళుతున్న ప్రజలు భయంతో పరుగెత్తారు.

విషయం తెలుసుకున్న పోలీసులు తీవ్రగాయాలపాలైన సుధాకర్ ను 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, సుధాకర్ కు మతిస్థిమితం లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారన్నారు. చికిత్స పూర్తయిన అనంతరం సుధాకర్ ను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పేర్కొన్నారు.

Andhra Pradesh
Krishna District
mental
blade
Police
  • Loading...

More Telugu News