Ricky Ponting: భారత ప్రపంచకప్ జట్టులో పంత్ పేరు లేకపోవడంతో ఆశ్చర్యపోయా: పాంటింగ్

  • పంత్ చాలా నిరాశ చెంది ఉంటాడు
  • అతడిలో చాలా నైపుణ్యం ఉంది
  • కనీసం మూడు ప్రపంచకప్‌లు అయినా ఆడాలి

టీమిండియా ఆల్‌రౌండర్ రిషభ్‌ పంత్‌కు భారత ప్రపంచకప్ జట్టులో చోటు లభించకపోవడంపై ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న పాంటింగ్ మాట్లాడుతూ.. సెలక్టర్లు ప్రకటించిన భారత జట్టులో రిషభ్ పేరు ఉంటుందని భావించానన్నాడు. పంత్ లాంటి ఆటగాడు ఫోర్త్ డౌన్, లేదంటే ఫిప్త్ డౌన్‌లో దిగితే జట్టుకు వచ్చే బలమే వేరన్నాడు. నిజానికి టీమిండియాకు, ఇతర జట్లకు మధ్య ఉండే తేడా అదేనని అభిప్రాయపడ్డాడు.  

పంత్‌కు బదులుగా దినేశ్ కార్తీక్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. జట్టును ప్రకటించిన తర్వాత సోమవారం రాత్రి పంత్‌ను పాంటింగ్ కలిశాడు. ‘‘జట్టులో పంత్ పేరు లేకపోవడం చూసి నిజంగా ఆశ్చర్యపోయా’’ అని పాంటింగ్ పేర్కొన్నాడు. పంత్‌లో ఎంతో నైపుణ్యం ఉందన్న పాంటింగ్.. పంత్ తన కెరీర్‌లో కనీసం మూడు ప్రపంచకప్‌లు ఆడకపోతే అది ఆశ్చర్యమేనన్నాడు. జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై పంత్ తీవ్రంగా నిరాశ చెంది ఉంటాడని పాంటింగ్ పేర్కొన్నాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News