Kaveri Travels: కావేరీ ట్రావెల్స్ బస్సు బోల్తా... తప్పిన పెను ప్రమాదం!

  • బెంగళూరు నుంచి వస్తున్న బస్
  • ప్రయాణికులకు స్వల్పగాయాలు
  • కొత్తకోట మండలంలో ఘటన

బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు, ఈ తెల్లవారుజామున అదుపుతప్పింది. ఈ ఘటనలో బస్సు బోల్తా కొట్టినప్పటికీ, రోడ్డు చదునుగా ఉండటంతో ప్రాణనష్టం జరగలేదు. పలువురు ప్రయాణికులు స్వల్పగాయాలతో తప్పించుకున్నారు. బెంగళూరు నుంచి నిన్న రాత్రి బయలుదేరిన బస్సు, మరికాసేపట్లో హైదరాబాద్ చేరుకుంటుందన్న సమయంలో కొత్తకోట మండలం విలియం కొండ గ్రామం 44వ నెంబర్ జాతీయ రహదారిపై బోల్తా పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Kaveri Travels
Bus
Road Accident
  • Loading...

More Telugu News