Jana Sena: జనసేన ఐటీ సెంటర్‌కు టు-లెట్‌ బోర్డు!

  • ఎన్నికల కోసం ఐటీ సెంటర్ ఏర్పాటు
  • తొలుత మూడంతస్తుల భవంతి, ఇప్పుడు ఒక్క అంతస్తు మాత్రమే
  • 350 మందిని తొలగించిన జనసేన!
  • వైఎస్ఆర్ కాంగ్రెస్ దీ అదే దారి!

నిన్నమొన్నటి వరకూ దాదాపు 500 మందికి పైగా ఉద్యోగులతో కళకళలాడిన జనసేన ఐటీ సెంటర్ కు ఇప్పుడు టూ-లెట్ బోర్డు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు పార్టీ సామాజిక మాధ్యమ ప్రచారం కోసం హైదరాబాద్, రాయదుర్గంలోని ఖాజాగూడ సమీపంలో మూడంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకోగా, పవన్ కల్యాణ్ స్వయంగా దీన్ని ప్రారంభించారు.

పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తోట చంద్రశేఖర్‌ దీనికి సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నికలు ముగిసి వారం గడవకుండానే, విధుల్లో ఉన్న 350 మందిని తొలగించడంతో పాటు, అద్దెకు తీసుకున్న మూడు అంతస్తుల్లో ఒక అంతస్తును మాత్రమే తమ అధీనంలో ఉంచుకున్నారు. దీంతో మిగతా రెండు అంతస్తులనూ అద్దెకిస్తామంటూ దాని యజమాని టు-లెట్ బోర్డు తగిలించారు.

ఇదిలావుండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐటీ సెంటర్‌ లోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌, లోటస్ పాండ్‌ సమీపంలో ఉన్న ఐటీ కేంద్రం ద్వారా సామాజిక మాధ్యమ ప్రచారం, యూట్యూబ్‌ చానళ్ల నిర్వహణ జరుగగా, పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఇక్కడ పనిచేసిన వారిలో అత్యధికులను ఇక రావాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News