Andhra Pradesh: ఏపీలో ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

  • ఇప్పటికే తెలంగాణలో వేసవి సెలవులు
  • జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం
  • సెలవుల్లో క్లాసులు నిర్వహించే ప్రైవేటు స్కూళ్లపై కఠిన చర్యలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఈ నెల 23 ఆఖరి పనిదినమని పేర్కొన్న ఏపీ విద్యాశాఖ.. 24 నుంచి సెలవులు ప్రకటించినట్టు తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని విద్యాశాఖ పేర్కొంది. సెలవుల్లో తరగతులు నిర్వహించే ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వేసవి సెలవులు ప్రకటించింది.

Andhra Pradesh
schools
summer holidays
education ministry
  • Loading...

More Telugu News