Vizag: చంద్రబాబును సీఎం పదవి నుంచి తొలగించాలి: దాడి వీరభద్రరావు డిమాండ్

  • ఈ విషయమై గవర్నర్ జోక్యం చేసుకోవాలి
  • టీడీపీని చంద్రబాబు భ్రష్టుపట్టించారు
  • ఎన్నికల నిబంధనలు అధికంగా ఉల్లంఘించింది బాబే

ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు భ్రష్టుపట్టించారని, ఆయనకు డబ్బు, పదవి మాత్రమే ముఖ్యమని వైసీపీ నేత దాడి వీరభద్రరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో అత్యధిక సార్లు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించింది చంద్రబాబేనని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సమీక్ష నిర్వహించడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించినట్టయిందని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబును సీఎంగా కొనసాగించడం తగదని, ఈ విషయమై గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని, ఆ పదవి నుంచి బాబును తొలగించాలని డిమాండ్ చేశారు.

Vizag
YSRCP
dadi veera bhadra rao
Chandrababu
  • Loading...

More Telugu News