Baba Ramdev: మోదీ ఏం తప్పు చేశారని ఓడించాలంటున్నారు? ఆయనకు సొంత ఇల్లూ లేదు, కుటుంబమూ లేదు!: బాబా రాందేవ్

  • ప్రధానికి యోగా గురు బాసట
  • ఆయనకు ఎలాంటి స్వప్రయోజనాలు లేవు
  • మోదీ చేతుల్లోనే దేశం భద్రంగా ఉంటుంది

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్  ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా మాట్లాడారు. "అసలు, నరేంద్ర మోదీ ఏం తప్పు చేశారని ఆయన్ను ఓడించాలంటున్నారు? దేశ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ఆయనకు ఇల్లు లేదు, కుటుంబం లేదు. సొంత ప్రయోజనాలు అసలే లేవు. అలాంటి వ్యక్తికి అందరూ బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది" అంటూ పిలుపునిచ్చారు.

మోదీ మళ్లీ అధికారం చేపట్టకుండా ఉండడానికి వ్యతిరేక శక్తులైన కొన్ని ముస్లిం, క్రైస్తవ దేశాలు కోట్ల రూపాయలు పంపిస్తున్నాయని మండిపడ్డారు. కానీ, మోదీ ప్రధాని అయితేనే దేశం సురక్షితంగా ఉంటుందని బాబా రాందేవ్ అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాలకు మోదీ నాయకత్వంలోనే భరోసా ఉంటుందని స్పష్టం చేశారు. ఇవాళ బీజేపీకి మద్దతుగా జైపూర్ లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.

Baba Ramdev
Narendra Modi
BJP
  • Loading...

More Telugu News