Prakash Raj: కష్టాలు దాటి ఈ స్థాయికి వచ్చారు కాబట్టే రాజకీయాలను ఎంచుకున్నారు: ప్రకాశ్‌రాజ్ భార్య ట్వీట్

  • నటించి డబ్బులు సంపాదించడం చాలా సులువు
  • విభిన్నమైన మార్గం ఎంచుకున్నారు
  • పేద ప్రజల బాధ ఆయనకు తెలుసు

నటించి డబ్బులు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకోవడం తన భర్తకు తెలుసని, కానీ ఇప్పుడాయన విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారని ప్రకాశ్‌రాజ్ భార్య పోనీ వర్మ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. బెంగుళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్రకాశ్‌రాజ్ బరిలోకి దిగారు. ఈ విషయమై పోనీ ట్వీట్ చేశారు.

‘నటించి డబ్బులు సంపాదిస్తూ తన కుటుంబాన్ని చూసుకోవడం ఆయనకు చాలా సులభమైన పని. కానీ ఆయన విభిన్నమైన మార్గం ఎంచుకున్నారు. కష్టాలు దాటి ఈ స్థాయికి వచ్చారు కాబట్టే ఆ దారి ఎంచుకున్నారు. పేద ప్రజల బాధ ఆయనకు తెలుసు’ అని పోనీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అలాగే తన భర్తకు సంబంధించిన ఓ ఫొటోని షేర్ చేసిన పోనీ, ‘2015లో తీసిన ఫొటో ఇది. మీడియాను పిలిచి ఆ గ్రామం ఎంత అభివృద్ధి చెందిందో ఎందుకు చూపించవు? అని ప్రతిసారి నేను ఆయన్ను అడుగుతుంటా’ అని ట్వీట్ చేశారు. దీనికి తాను సంతృప్తి కోసం చేస్తున్నానని, చూపించుకోవడం కోసం కాదని ప్రకాశ్‌రాజ్ తనకు చెబుతుంటారని పోనీ పేర్కొన్నారు.  

Prakash Raj
Poni Varma
Twitter
Politics
Bengulore
  • Loading...

More Telugu News