Raghuveer: మరోసారి పోలీసులకు పూనమ్ కౌర్ ఫిర్యాదు

  • కేసు వివరాలను తెలుసుకున్న పూనమ్
  • 36 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు
  • నిందితులను పట్టుకుంటామన్న అడిషనల్ డీసీపీ

తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ నటి పూనమ్‌కౌర్ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తనపై అసభ్యకర పోస్టులు, వీడియోలను యూట్యూబ్ ఛానళ్లలో పోస్ట్ చేసిన వారిపై చర్య తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అడిషనల్ డీసీపీ రఘువీర్‌ను కలిసిన పూనమ్ తన కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రఘువీర్ మీడియాతో మాట్లాడుతూ, పూనమ్ 36 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని రఘువీర్ తెలిపారు.

Raghuveer
Punam Kaur
Police Station
Youtube
Cyber Crime
  • Loading...

More Telugu News