Chandrababu: వాట్సాప్ తో మీ వాళ్లందరికీ తెలియజేయండి.. అన్యాయాలను ఎండగట్టండి: చంద్రబాబు

  • త్వరలో దేశవ్యాప్తంగా సదస్సులు
  • ఈసీ అవకతవకలు అందరికీ చెబుతా
  • ఇప్పుడు మౌనం వహిస్తే భవిష్యత్తులో ఎవరినీ ప్రశ్నించలేం

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈవీఎంల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. అమరావతి మీడియా సమావేశంలో పోలవరం ప్రాజక్టు వివరాలు వెల్లడించిన తర్వాత నేరుగా పోలింగ్ పరిణామాలపై మాట్లాడారు. ఈసీ అవకతవకలపై తాను ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టానని, చెన్నైలో, కర్ణాటకలో కూడా పెట్టానని తెలిపారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రజలు, మేధావులు, మీడియా, విద్యార్థులకు అందరికీ విజ్ఞప్తి చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెబుతానని అన్నారు.

ఏకపక్ష నిర్ణయాలు, ఏకపక్ష దాడులతో మేం ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే కుదరదని హెచ్చరించారు. ఇలాంటి అప్రజాస్వామిక ధోరణులను సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వాడాలని, జరుగుతున్న అన్యాయాలపై వాట్సాప్ వంటి సాధనాలతో తెలిసినవాళ్లకి, స్నేహితులకి ప్రచారం చేయాలని సూచించారు.

ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే, ఆనాడు స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్ఫూర్తి వృథా అవుతుందని అన్నారు. ఇప్పుడు ఉదాసీనంగా ఉంటే రాబోయే రోజుల్లే ప్రశ్నించలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News