parliament: లోక్ సభ రెండో విడత పోలింగ్ రేపే.. బరిలో ఉన్న పలువురు కీలక నేతలు వీరే!

  • 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పోలింగ్
  • 96 లోక్ సభ స్థానాల్లో ఓటింగ్
  • అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 1611 మంది అభ్యర్థులు

రేపు లోక్ సభ రెండో విడత పోలింగ్ జరగనుంది. 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి 96 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. భారీ ఎత్తున నగదు పట్టుబడటంతో తమిళనాడులోని వేలూరు స్థానానికి పోలింగ్ ను ఎన్నికల సంఘం నిలిపివేసింది. రేపటి పోలింగ్ లో మొత్తం 15,79,34,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1611 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రేపటి పోలింగ్ సందర్భంగా బరిలో ఉన్న కొందరు కీలక నేతలు వీరే...

ఉత్తరప్రదేశ్:
  • హేమమాలిని - బీజేపీ (మథుర)
  • రాజ్ బబ్బర్ - కాంగ్రెస్ (ఫతేపూర్ సిక్రీ)

బీహార్:
  • తారిఖ్ అన్వర్ - కాంగ్రెస్ (కతిహార్)

తమిళనాడు:
  • కనిమొళి - డీఎంకే (తూత్తుకుడి)
  • తమిళిసై సౌందర్రాజన్ - బీజేపీ (తూత్తుకుడి)
  • పొన్ రాధాక్రిష్ణన్ - బీజేపీ (కన్యాకుమారి)
  • ఏ రాజా - డీఎంకే (నీలగిరి)
  • కార్తీ చిదంబరం - కాంగ్రెస్ (శివగంగ)

కర్ణాటక:
  • దేవెగౌడ - జేడీఎస్ (తుముకూరు)
  • సుమలత - ఇండిపెండెంట్ (మాండ్య)
  • నిఖిల్ కుమారస్వామి - జేడీఎస్ (మాండ్య)
  • ప్రకాశ్ రాజ్ - ఇండిపెండెంట్ (బెంగళూరు సెంట్రల్)

మహారాష్ట్ర:
  • ప్రకాశ్ అంబేద్కర్ - వంచిత్ బహుజన్ అఘాడీ (అకోలా)

జమ్ముకశ్మీర్:
  • ఫరూక్ అబ్దుల్లా - నేషనల్ కాన్ఫరెన్స్ (శ్రీనగర్)
  • జితేంద్ర సింగ్ - బీజేపీ (ఉధంపూర్).

  • Loading...

More Telugu News