shasi tharoor: కేరళకి లభించిన గొప్ప ఆస్తి శశిథరూర్: ప్రశంసలతో ముంచెత్తిన రాహుల్ గాంధీ

  • కేరళ కొత్త సంవత్సరం రోజున గాయపడిన శశిథరూర్ 
  • గాయాలతోనే ప్రచారానికి హాజరు 
  • ప్రశంసించిన రాహుల్ గాంధీ

కేరళలో ఈ నెల 23వ తేదీన లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో, అక్కడ అన్ని పార్టీల ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తమ పార్టీ విజయం సాధించాలనే దిశగా రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన 'తిరువనంతపురం'లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.

ఇక తిరువనంతపురం లోక్ సభ నియోజక వర్గం నుంచి ఇప్పటికే రెండు సార్లు వరుసగా విజయాన్ని సాధించిన శశిథరూర్, వచ్చే ఎన్నికల్లోను ఇదే స్థానం నుంచి పోటీకి దిగారు.   అయితే, రెండు రోజుల క్రితం స్థానిక ఆలయాన్ని సందర్శించిన సందర్బంగా,   మొక్కుబడి చెల్లించడంలో భాగంగా శశి థరూర్ 'తులాభారం' తూగుతుండగా 'త్రాసు' తెగి, గాయాలయ్యాయి.

అయితే, ఆ గాయాలను సైతం లెక్క చేయకుండా ఆయన రాహుల్ తో కలసి ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో పార్టీ పట్ల ఆయనకి గల అంకితభావాన్ని .. ప్రజల పట్లగల సేవా భావాన్ని గురించి ప్రశంసిస్తూ, ఆయన కేరళకి లభించిన గొప్ప ఆస్తి అంటూ అభినందించారు.   

shasi tharoor
rahul gandhi
  • Loading...

More Telugu News