Hyderabad: ఆ అమ్మాయిని పైదుస్తులు మాత్రమే తీయమన్నాం: యాక్టింగ్ స్కూల్ ట్రైనర్ వినయ్
- అమ్మాయి చెప్పే వాటిలో తప్పులేదు
- అది నటనలో భాగమే
- ‘సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్’ విద్యార్థిని ఫిర్యాదుపై వివరణ
నటన నేర్పాలంటే ఒంటిపై బట్టలన్నీ విప్పాలని ‘సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్’ యాక్టింగ్ స్కూల్ డైరెక్టర్ పేర్కొన్నట్టుగా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఇనిస్టిట్యూట్ విద్యార్థిని అచింత కౌర్ చద్దా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలపై ‘సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్’ కు చెందిన డైరెక్టర్, ట్రైనర్ వినయ్ వర్మ వివరణ ఇచ్చారు.
ఆ అమ్మాయిని పైదుస్తులు మాత్రమే తీయమన్నాం కానీ లోదుస్తులు కాదని, అమ్మాయి చెప్పే వాటిలో తప్పులేదని, అది నటనలో భాగమేనని, ఆ విధంగా చేయడం నచ్చకపోతే వెళ్లొచ్చని ఆ విద్యార్థినికి చెప్పానని స్పష్టం చేశారు. నటనలో అసభ్య ప్రవర్తన ఉండదని, ఇదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పానని, నటనపై ఇంట్రస్ట్ లేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. గత ఇరవై ఏళ్లుగా ఇదే విధంగా క్లాస్ లు చెబుతున్నట్టు వినయ్ వర్మ తెలిపారు.