Andhra Pradesh: పచ్చటి డెల్టాలో వైసీపీ నేతలు వైషమ్యాలు రెచ్చగొట్టారు!: ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు

  • ఇందుకు వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
  • ఈసీ అధికారులంతా వైసీపీ నేతలకు సహకరించారు
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ లోని పచ్చటి డెల్టా ప్రాంతంలో వైసీపీ నేతలు వైషమ్యాలు రెచ్చగొట్టారని ఏపీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనందబాబు విమర్శించారు. ఇందుకు వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఏపీలోని ప్రతీ నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు వైసీపీకి సహకరించారని ఆరోపించారు.

అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో నక్కా ఆనందబాబు మాట్లాడారు. ఈవీఎంల్లో లోపాలు, దౌర్జన్యాలతో వైసీపీ పన్నిన కుట్ర అట్టర్ ఫ్లాప్ అవుతుందని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించడం ఖాయమనీ, అన్నివర్గాల ప్రజలు టీడీపీకే మరోసారి పట్టం కడతారని జోస్యం చెప్పారు.

Andhra Pradesh
Telugudesam0
Telugudesam
YSRCP
Jagan
nakka
  • Loading...

More Telugu News